సినీ దర్శక, నిర్మాత విజయరెడ్డి కన్నుమూత

Daily Current Affairs

సినీ దర్శక, నిర్మాత విజయరెడ్డి కన్నుమూత

ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత బి. విజయరెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. 1936, జూలై 15న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విజయరెడ్డి జన్మించారు. నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్న ఆయన పలు చిత్రాలకు సహాయ ఎడిటర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్‌గా పనిచేశారు. 1970లో ‘రంగా మహల్‌ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 1966లో తెలుగులో ‘శ్రీమతి’ చిత్రం ద్వారా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. కన్నడలో 40 చిత్రాలను, హిందీలో 17 చిత్రాలను తెరకెక్కించిన ఆయన రాజ్‌కుమార్, విష్ణువర్థన్ , అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *