జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్‌

0
19

తెలంగాణ ఎంసెట్ 2021ను ఈ ఏడాది జూన్ రెండో వారంలో నిర్వ‌హించేందుకు రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంది. ఎంసెట్ 2021కు సంబంధించిన తేదీల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. క‌రోనా ప్ర‌భావంతో ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ఆల‌స్యంగా ప్రారంభ‌మైన నేప‌థ్యంలో వార్షిక ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ చివ‌రి వారంలో నిర్వ‌హించి, మే రెండో వారానికి పూర్తి చేయాల‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ముగిశాక మూడు నుంచి నాలుగు వారాల గ‌డువు ఇచ్చి ఎంసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

గ‌తేడాది ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు నాలుగు రోజుల పాటు, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ స్ర్టీం విద్యార్థుల‌కు మూడు రోజుల పాటు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ఏడాది ఎంసెట్‌ను మే నెల‌లోనే నిర్వ‌హిస్తారు. కానీ క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో 2020లో ఎంసెట్ ప‌రీక్ష‌ల‌ను సెప్టెంబ‌ర్ నెల‌లో నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here