బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

0
38

బీఎస్సీ నర్సింగ్‌, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ  డిగ్రీ  కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 18 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నాలుగేళ్ల  డిగ్రీ కోర్సు బాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌(బీఎస్సీ నర్సింగ్‌), రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ (పీబీబీఎస్సీ నర్సింగ్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ మెడికల్‌ లేబరేటరీ టెక్నాలజీ (బీఎస్సీ ఎంఎల్‌టీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here