హైద‌రాబాద్‌లోని ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు

0
803

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* టెక్నిక‌ల్ ఆఫీస‌ర్

* మొత్తం ఖాళీలు: 19

పోస్టింగ్ విభాగాలు: ఎస్ఎస్‌పీడీ-హైద‌రాబాద్‌, ఐటీఎస్‌డీ-హైద‌రాబాద్‌, ఎస్‌జీఎస్‌డీ-హైద‌రాబాద్, ఆర్ఐడీ-హైద‌రాబాద్‌, సీఎన్ఐడీ-హైద‌రాబాద్‌.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత టెక్నిక‌ల్ నైపుణ్యాల్లో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్య‌డీ‌ల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.23,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/ బీటెక్‌ మార్కులు, సంబంధిత అనుభ‌వం ప్రాతిప‌దిక‌గా 1:5 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ‌, అనుభ‌వం ఆధారంగా ఎంపికైన వారిని తుది ఎంపిక‌లో భాగంగా ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌కి పిలుస్తారు.‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.01.2021.
Notification Information

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here