భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 12
1) నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్: 03 పోస్టులు
అర్హత: సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
2) లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03 పోస్టులు
అర్హత: లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
3) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 06 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. దీనితో పాటు స్కిల్ టెస్ట్ (డిక్టేషన్-నిమిషానికి 80 పదాలు), ట్రాన్స్‌స్క్రిప్షన్ (కంప్యూటర్ మీద 50 నిమిషాలు-ఇంగ్లిష్) చేయాలి. స్టెనోగ్రాఫర్‌గా ఏడాది పని చేసిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి కింద సూచించిన చిరునామాకి పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేది: 01.02.2021.
చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ), శివరాంపల్లి, హైదరాబాద్-500052.
Telangana Jobs ఎస్వీపీఎన్పీఏ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు