శ్రీకాకుళం జిల్లాలో 60 సాగరమిత్ర పోస్టులు దరఖాస్తుకు చివరి తేది జనవరి 21

0
404

శ్రీకాకుళం జిల్లాలో 60 సాగరమిత్ర పోస్టులు దరఖాస్తుకు చివరి తేది జనవరి 21

Sagara Mitra Jobs In Srikakulam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ఫిషరీస్ సైన్స్‌/మెరైన్ బయాలజీ/జువాల జీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 30.11.2020 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు,సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్ రూపంలో ఆధారాలు సమర్పించాలి. వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం-తుది ఎంపిక ఉంటుంది. మెరిట్(అకడమిక్ విద్యార్హతలు)కు 75శాతం, సాఫ్ట్ స్కిల్స్‌కు 10శాతం; ఇంటర్వ్యూకు 15శాతం; దీనిలో 80శాతం స్థానిక జిల్లా అభ్యర్థులకు, మిగతా 20శాతం ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా జిల్లాల అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, దరఖాస్తును మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, ఇలిసిపురం, శ్రీకాకుళం జిల్లా చిరునామాకు స్వయంగా గాని, పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: 21.01.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://srikakulam.ap.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here