కేంద్ర సమాచార శాఖ నియంత్రణ పరిధిలోకి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్

Educational News
  • కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి
  • ఎవరుపడితే వారు యూట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టేందుకు నో ఛాన్స్
  • ఇక ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌పై ప్రభుత్వ కన్ను

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ మరియు నెట్ ప్లిక్స్ వంటి కంటెట్ ప్రొవైడర్స్‌ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం సంతకం చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ తదితర పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ డిజిటల్‌ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఎలాంటి చట్టాలు లేదా స్వతంత్ర ప్రతిపత్తిగల అధికారిక సంస్థ లేదు.

ప్రస్తుతం ప్రింట్‌ మీడియాను ప్రెస్‌ కౌన్సిల్‌ నియంత్రిస్తోంది. ఇదేవిధంగా వార్తా ప్రసార చానళ్లను న్యూస్‌ బ్రాడ్ ‌క్యాస్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) మానిటర్‌ చేస్తోంది. సినిమాల విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్ ‌(సీబీఎఫ్‌సీ)కి అధికారాలుండగా.. ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది.

స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీ ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్స్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పరిధిలో న్యూస్‌ పోర్టల్స్‌తోపాటు.. హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తదితర స్ట్రీమింగ్‌ సర్వీసుల సంస్థలు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *