‘చీఫ్‌ సెలెక్టర్‌’ పదవికి మిస్బా గుడ్‌బై

Daily Current Affairs Educational News

తాను పాకిస్తాన్‌ క్రికెట్‌ పురుషుల జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ ప్రకటించాడు. నవంబర్‌ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్నీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి తెలియచేశాడు. జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్‌గా పూర్తిగా స్థాయిలో సేవలందించేందుకే సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌ జట్టు సెలెక్టర్‌గా, హెడ్‌ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *