ఇంజనీరింగ్‌లో 6 కొత్త కోర్సులు

Educational News

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా 6 కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు కాలేజీలు 18,210 సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 13,890 పాత సీట్లను రద్దుచేసి వాటిస్థానంలో ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. ఈనెల 9 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పటికే ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. కాగా, మొత్తం సీట్ల అనుమతికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. తాజాగా సవవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18-22 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా ప్రభుత్వం అనుమతించిన వాటిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) నెట్‌వర్క్స్‌ కోర్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ కోర్సులకే ఎక్కువ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *