345 పోస్టులకు యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్(1)-2021 నోటిఫికేషన్ విడుదల

Central Jobs

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1)-2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

సిడిఎస్ (Combined Defence Services) పరీక్షను ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఎ), ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఎ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఎఎఫ్ఎ) మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ) లో శిక్షణ పొందుతారు. పరీక్ష ఫిబ్రవరి మరియు సెప్టెంబరులలో సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. జాతీయ స్థాయి రక్షణ ప్రవేశ పరీక్షకు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారు.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 345
పోస్టుల వివరాలు:
ఇండియన్ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్-100
ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ-26
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ,హైదరాబాద్-32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై-170
ఎస్‌ఎస్‌సీ విమెన్ నాన్ టెక్నికల్-17

అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది: ఫిబ్రవరి 7, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.
దరఖాస్తుల ఉపసంహరణ: నవంబర్ 24, 2020 నుంచి నవంబర్ 30, 2020 వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.upsc.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *