జ‌న‌వ‌రి 2021లో సివిల్స్ మెయిన్స్‌

Educational News

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(యూపీఎస్‌సీ) విడుద‌ల చేసింది. జనవరి 2021లో సివిల్స్ మెయిన్స్ జరగనున్న‌ట్లు తెలిపింది. జ‌న‌వ‌రి 8 నుండి జ‌న‌వరి 17వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షల నిర్వ‌హ‌ణ‌. ఐదు రోజుల్లో ఎస్సే పేప‌ర్ ఉన్న రోజు మిన‌హా ప్ర‌తిరోజూ రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌రుగుతుందంది. పరీక్ష పూర్తి షెడ్యూల్ కోసం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ను సంద‌ర్శించాల్సిందిగా సూచించింది. అక్టోబర్ 4న జ‌రిగిన ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్షలో పనితీరు ఆధారంగా మెయిన్ ఎగ్జామ్స్‌కు మొత్తం 10,564 మంది అభ్యర్థులను ఎంపిక‌య్యారు.

అహ్మదాబాద్, ఐజ్వాల్‌, ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్), బెంగళూరు, భోపాల్, చండీగర్‌, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, డిస్పూర్ (గౌహ‌తి), హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో , రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం, విజయవాడలో సివిల్స్ మెయిన్స్ ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మెయిన్స్‌కు హాజ‌ర‌య్యేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 11 లేదా అంతకన్నా ముందుగా వివరణాత్మక దరఖాస్తు ఫారమ్(డీఏఎఫ్) నింపి సమర్పించాలంది.

 

వాట్సాప్ గ్రూప్
https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw

టెలిగ్రామ్ గ్రూప్
https://t.me/joinchat/AAAAAFiq2h7LZZgFTn3Cug

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *