త్వరలో జేఎల్స్‌ ఇంటర్వ్యూలు – ఏపీపీఎస్సీ

ఇంటర్మీడియెట్‌ విద్యలో జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్స్‌) పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్వ్యూలకు రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది అభ్యర్థులు ప్రొవిజినల్‌గా ఎంపికయ్యారు. అభ్యర్థుల వివరాలు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయా అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఇంటర్వ్యూలు ఎప్పడన్నదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. వెబ్‌సైట్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు: […]

Continue Reading

ఇంజనీరింగ్‌లో 6 కొత్త కోర్సులు

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా 6 కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు కాలేజీలు 18,210 సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 13,890 పాత సీట్లను రద్దుచేసి వాటిస్థానంలో ఈ కొత్త కోర్సులకు దరఖాస్తు చేశాయి. ఈనెల 9 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పటికే ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. […]

Continue Reading

‘చీఫ్‌ సెలెక్టర్‌’ పదవికి మిస్బా గుడ్‌బై

తాను పాకిస్తాన్‌ క్రికెట్‌ పురుషుల జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ ప్రకటించాడు. నవంబర్‌ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్నీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి తెలియచేశాడు. జాతీయ జట్టుకు హెడ్‌ కోచ్‌గా పూర్తిగా స్థాయిలో సేవలందించేందుకే సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని […]

Continue Reading

10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 2021నోటిఫికేషన్ విడుదల

త్రివిధ దళాల్లో కీలకమైన ఇండియన్ నేవీ.. ఎగ్జిక్యూటీవ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పర్మనెంట్ కమిషన్(పీసీ)10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ(కేరళ)లోని నేవల్ అకాడెమీ ఈ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో… జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 34(ఎడ్యుకేషన్ బ్రాంచ్-05;ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-29) అర్హతలు: పీసీఎమ్(ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) సబ్జెక్టులతో ఇంటర్ లేదా […]

Continue Reading