బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు

0
20

Bed First Phase Seats

బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కళాశాలల్లో తొలి విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. కన్వీనర్‌ కోటా మొత్తం  13,510 సీట్లు ఉండగా దాదాపు 18,870 మంది వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. తొలి విడుత 10,265 మందికి సీట్లు కేటాయించినట్లు టీఎస్‌ ఎడ్‌సెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ బాబు శుక్రవారం తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జాయినింగ్‌ లెటర్‌తోపాటు ట్యూషన్‌ ఫీజ్‌ చెల్లించేందుకు చలానా ఫామ్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

యూనియన్‌ బ్యాంక్‌ లేదా ఆంధ్రాబ్యాంకుల్లో ఎక్కడైనా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.  ట్యూషన్ ఫీజు చెల్లించిన తరువాత, విద్యార్థులు భౌతిక ధ్రువీకరణ కోసం ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు చెల్లించిన చలానా, జాయినింగ్ లెటర్‌తో ఈ నెల 18 నుంచి 22 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అనంతరం కళాశాల సీటు కేటాయిస్తుందని రమేశ్‌ బాబు తెలిపారు.  ఈ నెల 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here