గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల సిలబస్

 • మరో 9,359 లైన్‌మెన్‌ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్న విద్యుత్‌ డిస్కమ్‌లు
 • నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
 • వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు
 • 22 రకాల పోస్టులను భర్తీ చేయనున్న సర్కారు
 • మొత్తం 1,36,087 ప్రభుత్వోద్యోగాల భర్తీ
 • ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ
 • మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ఏర్పాటు
 • నేటి ఉ.11 గంటల నుంచి అందుబాటులోకి
 • విద్యార్హత, వయో పరిమితి,ఎంపిక విధానం వంటి వివరాలన్నీ వెబ్‌సైట్‌లో
 • ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ
 • సెప్టెంబరు 1న రాత పరీక్ష.. 150 మార్కులు,150 ప్రశ్నలు.. నెగిటివ్‌ మార్కులు కూడా
 • ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారికి వెయిటేజీ

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగ నియామకాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లు శుక్రవారం రాత్రి విడుదలయ్యాయి. గ్రామ సచివాలయాల్లో 95,088 ఉద్యోగాలకు పంచాయతీరాజ్‌ శాఖ.. పట్టణ వార్డు సచివాలయాల్లో 31,640 ఉద్యోగాలకు పట్టణాభివృద్ది శాఖ నోటిఫికేషన్లను వేర్వేరుగా జారీచేశాయి. శనివారం ఉ.11 గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. సెప్టెంబరు ఒకటవ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.

మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా..

ఆయా ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు  gramasachivalayam.ap.gov.in,   vsws.ap.gov. in,  wardsachivalayam.ap.gov.in అనే మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధంచేశారు.
శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్, పట్టణాభివృద్ది శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి వివరాలను ఆయా వెబ్‌సైట్లలోనే అందుబాటులో ఉంచుతారు. 

Grama Sachivalayam Notifications

RURAL

S.NoName Of The NotificationsDownload
1Recritment for the Post of Panchayat Secretary (Grade-V)
2Recritment for the Post of Village Revenue Officer (Grade-II)
3Recritment for the Post of ANMs (Grade-III)
4Recritment for the Post of Animal Husbandary Assistant
5Recritment for the Post of Village Fisheries Assistant
6Recritment for the Post of Village Horticulture Assistant
7Recritment for the Post of Village Agriculture Assistant (Grade-II)
8Recritment for the Post of Village Sericulture Assistant
9Recritment for the Post of Mahila Police and Women & Child Welfare Assistant
10Recritment for the Post of Engineering Assistant (Grade-II)
11Recritment for the Post of Panchayat Secretary (Grade-VI) Digital Assistant
12Recritment for the Post of Village Surveyor (Grade-III)
13Recritment for the Post of Welfare and Education Assistant

URBAN

S.NoName Of The NotificationsDownload
1Recritment for the Post of Ward Administrative Secretary
2Recritment for the Post of Ward Amenities Secretary (Grade-II)
3Recritment for the Post of Ward Sanitation & Environment Secretary (Grade-II)
4Recritment for the Post of Ward Education & Data Processing Secretary
5Recritment for the Post of Ward Planning & Regulation Secretary (Grade-II)
6Recritment for the Post of Ward welfare & Development secretary (Grade-II)

సిలబస్

 • ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.
 • ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.
Post Name ఉదయం  Paper -1 Syllabus సాయంత్రం            Paper – 2 Syllabus
వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, వేల్పేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు                             75 మార్కులకు జనరల్‌ నాలెడ్జి   75 మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ
ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్, విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ హార్టికల్చర్‌ అసిస్టెంట్, విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు       50 మార్కులకు జనరల్‌ నాలెడ్జి   సాయంత్రం 100 మార్కులకు రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీతో పాటు ఆయా ఉద్యోగానికి సంబంధించిన అంశాలపై పరీక్ష ఉంటుంది.

గ్రామ సచివాలయల్లో.. ఉద్యోగ హోదా విద్యార్హతలు : 

నం. ఉద్యోగి హోదా ప్రతిపాదనలో ఉన్న కనీస విద్యార్హత
1. పంచాయతీ కార్యదర్శి ఏదైనా డిగ్రీ
2. గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం
3. సర్వే అసిస్టెంట్
4. ఏఎన్‌ఎం ఎస్‌ఎస్‌సీ లేదా తత్ససమానం, ఎంపీహెచ్ కోర్సు లేదా హెల్త్ వర్కర్ కోర్సు తప్పనిసరి
5. వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ రెండేళ్ల పాలిటెక్నికల్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు
6. మహిళల సంరక్షణ అధికారి ఏదైనా డిగ్రీ , కంప్యూటర్ పరిజ్ఞానం
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ డిప్లమా లేదా డిగ్రీ
8. ఎలక్ట్రికల్ లైన్‌మెన్ ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషనల్ ఎలక్ట్రికల్
9. అగ్రి, హార్టీకల్చర్ ఎంపీఈవోలు బీఎస్సీ (అగ్రి) లేదా బీటెక్ (అగ్రి) లేదా రెండేళ్ల పాలిటెక్నికల్ డిప్లొమా
10. డిజిటల్ అసిస్టెంట్ కంప్యూటర్ డిప్లొమా లేదా డిగ్రీ
11. వెల్పేర్ అసిస్టెంట్ ఇంటర్మీడియెట్

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వెయిటేజీ

ఇప్పటికే ఆయా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తూ నోటిఫికేషన్‌లో పేర్కొన్న మేరకు వారికి అర్హత ఉండి రాత పరీక్షకు హాజరైతే.. అలాంటి అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి ఆ శాఖలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ వెయిటేజీ వేర్వేరుగా ఉంటుంది.  

9,359 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కూడా.
ఇదిలా ఉంటే.. 9,359 ఎనర్జీ అసిస్టెంట్‌ (లైన్‌మెన్‌) ఉద్యోగాల భర్తీకి కూడా  వేరుగా నోటిఫికేషన్‌ రానుంది. విద్యుత్‌ డిస్కంలు దీనిని జారీచేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు 5,573 గ్రామ ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టులను, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 3,786 వార్డు ఎనర్జీ సెక్రటరీ పోస్టులను డిస్కంలు వేరుగా భర్తీచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామక నిబంధనలకు, డిస్కం ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల తీరు వేర్వేరు కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ నోటిఫికేషన్‌ కూడా ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

గ్రామ కార్యదర్శి విధులు
గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు , విధులు
సర్పంచ్ విధులు – అధికారాలు
గ్రామ పంచాయతీ సమావేశాలు …. మొదలులగు అంశాలు ఉన్నవి
ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి

????
https://www.examsnotes.in/duties-of-the-village-secretary/

అర్థమెటిక్, రీజనింగ్ స్టడీ మెటీరియల్

Please Share
Updated: July 28, 2019 — 5:52 am