ఏపీ బడ్జెట్‌ – AP-Budget-2020-21 PDF Free Download

113 Views

ఏపీ బడ్జెట్‌ – AP-Budget-2020-21 PDF Free Download

Daily Current Affairs

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోవ సారి వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను 2020–21 సంవత్సరానికి  ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించింది. ఈ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాంజలి కవితతో ముగించారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా ఆర్థికమంత్రి తెలియజేశారు. తొలుత ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గతానికి భిన్నంగా తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజభవన్ నుంచి గవర్నర్ ప్రసంగించడం విశేషం. ఏడాదిలో 3.98 కోట్ల మంది ప్రజలకు రూ.42వేల కోట్ల సాయం అందజేశామన్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత. చేయూత కింద నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేలు, అమ్మ ఒడి ద్వారా 42.33 లక్షల మంది తల్లులకు రూ.6,350 కోట్లు అందజేయనున్నట్టు వివరించారు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే కాగా.. 2019-20కి అది 20 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు, మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు, ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు, ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం. కరోనా మహమ్మరి కారణంగా ఈసారి బడ్జెట్ అంచనాలు 1.4 శాతం తగ్గాయని వెల్లడించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పెట్టిన చీఫ్ ‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

పూర్తి బడ్జెట్ PDF క్రింద ఉన్న లింకు నుండి పొందగలరు 

Download AP Budget-2020-21 PDF

ఏపీ బడ్జెట్
Updated: June 16, 2020 — 2:04 pm