ఇండియా పోస్ట్‌లో 3446 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌లు

0
255

3446-GDS Posts in Telangana And Andhra Pradesh

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి భారతీయ పోస్టల్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆస్తకి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 3446 జీడీఎస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం) లేదా డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. స్థానిక భాషలో ప్రావిణ్యం ఉండి పదో తరగతి పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 3446

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాషలో మంచి మార్కులు స్కోర్‌ చేసి ఉండాలి. 2021, జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. స్థానిక భాషలో మాట్లాడటంతోపాటు రాయగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

ఎంపిక విధానం: అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న విద్యార్హతలు, పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 26

వెబ్‌సైట్‌: https://indiapost.gov.inor

https://appost.in/gdsonline

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here