30 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
76

30 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఏమి తప్పనిసరి చేశారు?- విమానాశ్రయంలోనే కరోనా పరీక్ష మరియు తప్పనిసరి నిర్బంధం.
 2. ఏ ద్విచక్ర వాహన తయారీదారు తన 100 మిలియన్ల బైక్‌ను ఫ్యాక్టరీ నుండి తయారు చేసి, ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థగా అవతరించింది? – హీరో మోటోకార్ప్.
 3. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏ బ్యాంకుకు రూ .2 కోట్ల జరిమానా విధించింది? – ప్రామాణిక చార్టర్డ్ బ్యాంక్.
 4. జకార్తాలోని ఆసియాన్ సచివాలయానికి భారత కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? – జయంత్ ఖోబ్రగడే.
 5. ఏ క్రికెటర్ శ్రీలంక ఫ్రాంచైజ్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు? – లసిత్ మలింగ.
 6. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయాతో సహా చైనా ఎంత మంది అధికారులను నిషేధించాలని నిర్ణయించింది? – 28 మంది అధికారులు.
 7. కాలిఫోర్నియో రాష్ట్రంలోని డేవిస్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
  కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తాజాగా పశ్చిమబెంగాల్‌ చేరింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
 8. రానున్న రెండేళ్లలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.
 9. చెన్నై మెరీనా తీరంలో నిర్మించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించారు. ఫీనిక్స్‌ పక్షి రూపంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో 50,422 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ చిహ్నాన్ని నిర్మించారు.
 10. దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు బేసిక్‌ గ్రాంట్ల కింద కేంద్ర ప్రభుత్వం రూ.12,315.5 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,137.03 కోట్లు, తెలంగాణకు రూ.1,385.25 కోట్లు వచ్చాయి.
 11. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విటర్‌ తొలగించింది.
 12. కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) నాయకుడు అభయ్‌సింగ్‌ చౌతాలా (57) తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
 13. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 17224 మంది చిన్నారుల అదృశ్యం కేసులు నమోదు కాగా 12,807 మందిని రక్షించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
 14. తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను నాబార్డ్‌ విడుదల చేసింది.
  తెలంగాణ రాష్ట్రం సేవల రంగంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. గత అయిదేళ్లలో ఏ రాష్ట్రం సాధించని స్థాయిలో సగటున 10.25% మేర వృద్ధి నమోదుచేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2019-20లో స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో సేవల రంగం వాటా 65.19 శాతంగా పేర్కొంది.
  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం కింద రూ.245.96 కోట్లు విడుదల చేసింది.
 15. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 5% ఫిట్‌మెంట్‌ (వేతన పెంపుదల) ఇవ్వాలని రాష్ట్ర వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది.
 16. AP రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. 2019-20కి గాను జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌’ అవార్డు దక్కింది.
 17. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల ద్వారా ఏటా సగటున రూ.61,515 ఆదాయం వస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 18. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,498.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,670.10 కోట్లతో పోలిస్తే లాభం 73 శాతం పెరిగింది.
 19. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వి-షేప్‌ రికవరీతో 11 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనావేసింది.
 20. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.28 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
 21. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.13,101 కోట్లకు చేరింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11,640 కోట్లుగా ఉంది.
 22. జాతీయ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ జి.నరేంద్రకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
 23. సూర్యాపేట పురపాలికలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికురాలు మెరుగు మారుతమ్మను పారిశుద్ధ్య విభాగంలో ‘కొవిడ్‌ ఉమెన్‌ వారియర్స్‌- ద రియల్‌ హీరోస్‌’ అవార్డుకు జాతీయ మహిళా కమిషన్‌ ఎంపిక చేసింది.
 24. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లిప్సా సయల్‌ అనే యువతి 14 గంటల్లో 72 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన ఘనత సాధించారు. హరియాణాకు చెందిన సయల్‌ గతంలో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు నిర్వహించిన 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ పోటీలో పాల్గొంది.
 25. హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌లో బోడెంపూడి శ్రీదేవి రాసిన ‘పచ్చని లోగిలి’ పుస్తకాన్ని ఆవిష్కంచారు.
 26. విశాఖలోని రుషికొండ తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో 30 అడుగుల సముద్ర గర్భం లోతున సహజ శిలాతోరణాన్ని విశాఖకు చెందిన ‘లివ్‌ఇన్‌ అడ్వంచర్‌’ స్కూబా డైవర్‌ బలరాంనాయుడితో కూడిన నలుగురు సభ్యుల బృందం గుర్తించింది.
 27. అసోంలోని మరిగోవ్‌ జిల్లాలో తివా వర్గ ప్రజలు ఏటా నిర్వహించే జోన్‌బీల్‌ మేళాలో కరెన్సీ నోటు వినియోగించకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
 28. మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి ‘జైలు పర్యాటకం’ ప్రారంభించేందుకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణేలోని ఎరవాడ జైలులో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ తెలిపారు.
 29. ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రాన్ని అబూదాబీలో నెలకొల్పారు. దీనికి ‘నూర్‌ అబూదాబీ’ (వెలుగుల అబూదాబీ) అని నామకరణం చేశారు.
 30. ప్రముఖ చరిత్రకారుడు, విశ్రాంత అధ్యాపకుడు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి (91) హైదరాబాద్‌లో మరణించారు. సుమారు ఏడు దశాబ్దాలకు పైగా అధ్యాపకుడిగా ఆయన సేవలందించారు.

  Join Whatsapp Groups

  Exams Trainer Online Examshttps://chat.whatsapp.com/CV1BkyuM4sf2NJvXF8Nm3P
  Exams Notes- Edu News https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw
  6 Months Current Affairs https://chat.whatsapp.com/EBPqA1In0cbAgbLxyWzQev

  Course ImageFree January – 2021 Daily Current Affairs- జనవరి డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి ఈ మొబైల్ యాప్ ద్వారా = http://on-app.in/app/oc/58832/sbxxr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here