01 జనవరి 2021 – డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్

0
116

01 January 2021 – Daily Current Affairs Bits in Telugu

 1. ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు? – భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
 2. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు ఏ సంస్థ అభివృద్ధి చేసింది? – భారత్ బయోటెక్ సంస్థ
 3. ‘తెలంగాణాస్ ఇయర్ ఆఫ్ ఏఐ-2020 అండ్ బియాండ్’ అనే నివేదికను ఎవరు , ఎప్పుడు విడుదల  చేసారు – తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు జనవరి 2
 4. 2020 ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ఇయర్ ఆఫ్ ది ఏఐ’గా ప్రకటించింది.- తెలంగాణ
 5. ఇటీవల మరణించిన కేంద్ర మాజీ హోం మంత్రి ఎవరు – బూటా సింగ్
 6. దేశంలో మొత్తం చిరుత పులుల సంఖ్య? – 12,852
 7. భారత్‌లో అత్యధికంగా చిరుతలు ఉన్న రాష్ట్రము – మధ్యప్రదేశ్ (3,421 చిరుతలు ఉన్నాయి), రెండవ స్థానంలో కర్ణాటక (1,783)
 8. చిరుత పులులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ రూపొందించిన నివేదిక పేరు – ‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా-2018’’
 9. దేశంలోని ఏ నగరాల్లో లైట్ హౌసింగ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది? – ఇండోర్(మధ్యప్రదేశ్), రాజ్‌కోట్(గుజరాత్), చెన్నై (తమిళనాడు), రాంచీ(జార్ఖండ్), అగర్తల(త్రిపుర), లక్నో(ఉత్తరప్రదేశ్)
 10. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకా పేరు? – కోవిషీల్డ్
 11. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఏ సంస్థ తయారు చేసింది – సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
 12. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు? – టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్
 13. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఏ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి జనవరి 1న అనుమతినిచ్చింది. – ‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’
 14. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంది.- 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో
 15. అమెరికన్ కంపెనీ ఫైజర్ ఏ జర్మన్ ఫార్మా కంపెనీ తో కలసి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది – బయోఎన్‌టెక్‌ (BioNTech)
 16. టీకాతో సమూలంగా నిర్మూలింపబడిన వ్యాధి ఏది? – స్మాల్‌పాక్స్ (మశూచి)
 17. స్మాల్‌పాక్స్ (మశూచి) టీకాను ఏ శాస్త్రవేత్త తయారు చేసాడు – ఎడ్వర్డ్ జెన్నర్ (1796లో)
 18. ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చల్లా రామకృష్ణారెడ్డి ఏ అవార్డు గ్రహీత – కృషి పండిట్ అవార్డు
 19. ఇటీవల మరణించిన భారత హాకీ మాజీ ఆటగాడు ఎవరు – మైకేల్ కిండో
 20. భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్న గిరిజన తెగలకు చెందిన తొలి వ్యక్తిగా ఎవరు – మైకేల్ కిండో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here